స్టార్ సింగర్ శ్రేయా ఘోషల్(Shreya Ghoshal) పేరు తెలియని సంగీత ప్రేమికుడు ఉండడు. అనేక భాషల్లో వేల పాటలు పాడింది. తాజాగా ఆమె కోల్‌కతాలో నేతాజీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈవెంట్‌లో ఓ యువకుడు చేసిన పని ప్రస్తుతం దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఒకవైపు శ్రేయా ఘోషల్ తన మధుర గానంతో అందరని మనసులు దోచేస్తుంటే.. ఆ యువకుడు మాత్రం తన ప్రేయసి మనసు దోచుకోవడంపై ఫోకస్ పెట్టిఉన్నాడు. అవకాశం దొరికిన వెంటనే పక్కనే ఉన్న తన ప్రియురాలికి ప్రపోజ్ చేసేశాడు. ఈ వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది.
ప్రపోజ్ చేయడానికి ముందే కాన్సర్ట్‌లో ‘యూ ఆర్ మై సెకండ్ లవ్’ అన్న ప్లకార్డ్ పట్టుకుని కనిపించాడు. దాన్ని గమనించిన శ్రేయా.. నీ ఫస్ట్ లవర్ ఎవరు? అంటూ ఆ యువకుడిని ప్రశ్నించింది. దాంతో ఆ యువకుడు తన పక్కనే ఉన్న యువతిని చూపి ‘తానే నా ఫస్ట్ లవ్.. మీరు అంగీకరిస్తే ఇక్కడే తనకు ప్రపోజ్ చేస్తా’ అని చెప్పాడు. అందుకు శ్రేయా ఘోషల్(Shreya Ghoshal) ఓకే చెప్పిన వెంటనే తన ప్రేయసికి ప్రపోజ్ చేసేశాడు. దీనికి సంబంధించిన వీడియోను ఓ వ్వక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరల్ అవుతోంది.