సమంత అనారోగ్యంపై మేనేజర్ మహేంద్ర క్లారిటీ..ఏమన్నారంటే..

0
93

ప్రముఖ నటి సమంతకు తీవ్ర అస్వస్థత గురయ్యారు. నిన్న కడప పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు చేరుకుంది సమంత. అయితే హైదరాబాద్ చేరుకున్న కొన్ని గంటల్లోనే అస్వస్దతకు గురైంది. తీవ్రమైన జలుబు, వైరల్ ఫివర్ తో సమంత ఇబ్బందిపడుతున్నట్టు తెలుస్తుంది.

సమంత ఆరోగ్యంపై సమంత మేనేజర్ మహేంద్ర క్లారిటీ ఇచ్చారు. సమంత పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. నిన్న కొంచెం దగ్గు ఉండటంతో AIG హాస్పిటల్లో టెస్ట్ చేయించుకుని తన ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వచ్చే కథనాలను నమ్మవద్దని సమంత మేనేజర్ మహేంద్ర కోరారు.