ఎన్టీఆర్ పై వెబ్ సిరీస్ నిర్మాతగా మంచు ఫ్యామిలీ

ఎన్టీఆర్ పై వెబ్ సిరీస్ నిర్మాతగా మంచు ఫ్యామిలీ

0
98

ఎన్టీఆర్ జీవితం పై బయోపిక్ తీశారు ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ ..అయితే అది రెండు పార్టులుగా రిలీజ్ చేశారు, కాని ఇది రాజకీయం అంశాలతో కలిపి తీశారు అనే విమర్శలు వచ్చాయి, తర్వాత వర్మ కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే చిత్రం తీశారు,ఇది కూడా రాజకీయ అంశంతోనే తీశారు అని విమర్శలు వచ్చాయి, అయితే ఎన్టీఆర్ చరిత్ర ఆనాటి తరం వారికి పూర్తిగా తెలుసు నేటి యువతరానికి తెలియదు.

అయితే తాజాగా మంచు మోహన్ బాబు కూడా నాడు అన్నగారితో కలిసి సినిమాలు చేశారు.. రాజకీయాల్లో ఉన్నారు, అయితే ఆయన సరికొత్త ఆలోచన చేశారు, తాజాగా ఎన్టీఆర్ చరిత్రపై వెబ్ సిరీస్ చేయనున్నారట. దీనిని మంచు విష్ణు ఒక వెబ్ సిరీస్ గా తీసుకువస్తారట. ఆయనే నిర్మాతగా ఉండనున్నారు.

కాని కథ మాటలు అన్నీ మోహన్ బాబు ఇవ్వనున్నారట, ఆయనకు ఎన్టీఆర్ గురించి పూర్తిగా తెలుసు కాబట్టి పూర్తి కథనం ఆయన ఇవ్వనున్నారు. ఎన్టీఆర్ జీవితచరిత్ర ఆధారంగా ఈ వెబ్ సిరీస్ రూపొందుతోందనే టాక్ వినిపిస్తోంది. చదరంగం అనే టైటిల్ ను ఖరారు చేశారట. దీనికి రాజ్ అనంత దర్శకత్వం వహిస్తారు, అలాగే ఎన్టీ రామారావు పాత్రలో హీరో శ్రీకాంత్ నటిస్తున్నారు. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అయిన జీ 5లో కొద్దీ రోజుల్లోనే ఈ సిరీస్ ప్రసారం కానుందని తెలుస్తోంది. ఇప్పటికే కొంత
మేరషూటింగ్ పూర్తి అయిందట.