తిరుపతిలో మోహన్ బాబు(Mohan Babu) జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మంచు కుటుంబం చేసిన రాజకీయ ప్రసంగాలు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అందులో మంచు మనోజ్(Manchu Manoj) ప్రసంగం అయితే వైరల్ అవుతోంది.
“వాళ్ల ఫ్యామిలీకే హెల్ప్‌చేయనివాళ్లు. వాళ్ల చుట్టుపక్కల వారికే హెల్ప్ చేయనివాళ్లు. మీకేం హెల్ప్ చేస్తారు. అది గుర్తుపెట్టుకొని.. కరెక్ట్‌గా చూజ్ చేసుకొని మీకు మీ ఏరియాలో ఉన్న పేదవాళ్లకు ఏ లీడర్ వస్తే సపోర్టివ్‌గా ఉంటుందో అనలైజ్ చేసి కరెక్ట్‌గా ఓటు వేయండి. కష్టాల్లో ఉండి ఎక్కువ డబ్బు ఇచ్చే వాళ్లు ఉంటే వద్దని మీకు చెప్పను. ఆ డబ్బు ఇచ్చాడని ఓటు వేయొద్దు. డబ్బు ఇస్తే థాంక్యూ బ్రదర్ అని చెప్పండి. ఆ తర్వాత మీకు నచ్చిన వాళ్లకు ఓటు వేయండి. పదిమందిని కలుపుకొని వెళ్లే లీడర్‌ని వెతుక్కోండి” అని మనోజ్(Manchu Manoj) పేర్కొన్నాడు.
ఇక మోహన్ బాబు కూడా మాట్లాడుతూ “ప్రధాని నరేంద్ర మోదీని చాలా సందర్భాల్లో కలిశాను. అలాంటి ఆలోచనలు, విధానాలు కలిగిన వ్యక్తి దేశానికి అవసరం. ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలి. రాష్ట్రంలో రెండు పార్టీలకు చెందిన వారు డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులు మనవే.. లంచాలు తీసుకున్న డబ్బులు.. ఆ డబ్బులు తీసుకోండి. ఓటును మాత్రం నచ్చిన వారికి వేయండి. రాష్ట్రాభివృద్ధి, దేశాభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లడానికి సహకరించండి” అని తెలిపాడు. దీంతో మంచు కుటుంబం వారి రాజకీయ ప్రసంగాలు వైరల్ అవుతున్నాయి.
Thrilled to share the complete version of the speech from my dad's @themohanbabu garu birthday celebration. Apologies for the live broadcast hiccup – seems we encountered a little technical glitch when my speech started. Reflecting on Ralph Waldo Emerson, "What lies behind us and… pic.twitter.com/vOwLcfLf2t
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) March 20, 2024
Read Also: కాంగ్రెస్‌లో చేరికల జోరు.. పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat