మంచు ఫ్యామిలీ మరోసారి రోడ్డు ఎక్కింది. ఈసారి తండ్రీ కొడుకులు ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసుకున్నారు. నటుడు మోహన్ బాబు (Mohan Babu) చిన్న కొడుకు మంచు మనోజ్ (Manchu Manoj) ఒంటి నిండా గాయాలతో పోలీసులను ఆశ్రయించగా… మోహన్ బాబు కూడా కొడుకుపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
Also Read : అభిషేక్‌తో కలిసి పార్టీకి వెళ్ళిన ఐశ్యర్యరాయ్.. పిక్స్ వైరల్..
కొంత కాలంగా మోహన్ బాబు కుటుంబంలో వివాదాలు నడుస్తున్న విషయం తెలిసిందే. గతంలో మంచు విష్ణు, మంచు మనోజ్ కొట్టుకుని పోలీస్ స్టేషన్ లో పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారు. ఇప్పుడు మోహన్ బాబు, ఆయన చిన్న కొడుకు మంచు మనోజ్ (Manchu Manoj) ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేశారు. తనను తండ్రి కొట్టాడని మంచు మనోజ్ ఫిర్యాదు పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. మరోవైపు మనోజే తనపై దాడి చేశాడని కొడుకుపై ఫిర్యాదు మోహన్ బాబు ఫిర్యాదు చేశాడు. స్కూల్, ఆస్తుల వ్యవహారంలో పరస్పర దాడులు జరిగినట్లు తెలుస్తోంది. దీంతో గాయాలతోనే మనోజ్ పీఎస్‌కు వచ్చి ఫిర్యాదు చేశాడు. తనతో పాటు తన భార్యపై కూడా దాడి చేశారని మోహన్ బాబుపై ఫిర్యాదు చేశాడు.