మంచు మనోజ్ కోసం క్రిష్ భారీ సాయం

మంచు మనోజ్ కోసం క్రిష్ భారీ సాయం

0
94

ఈ మ‌ధ్య టాలీవుడ్ లో సినిమా టైటిల్స్ విష‌యంలో వివాదాలు లేకుండా ఎవ‌రికైనా ఆ సినిమాకి ఈ టైటిల్ సూట్ అవుతుంది అనిపిస్తే ముందు రిజిస్ట్ర‌ర్ చేయించిన వారు ఆ ద‌ర్శ‌క నిర్మాత‌ల‌తో మాట్లాడితే వారికి ఇస్తున్నారు ఇది మంచి ప‌రిణామం అనే చెప్పాలి… టైటిల్ కోసం పోటీ అనేది లేదు.. అయితే ఇటీవల‌ జాను అనే టైటిల్ కూడా ప్ర‌భాస్ టీం దిల్ రాజుకు ఇచ్చిన విష‌యం తెలిసిందే.

తాజాగా మంచు మనోజ్ సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసుకుని, ఆ బ్యానర్ పై తొలి సినిమాగా అహం బ్రహ్మాస్మిని ప్రకటించాడు. అయితే వాస్త‌వానికి ఈ టైటిల్ ద‌ర్శ‌కుడు క్రిష్ రిజిస్ట‌ర్ చేయించార‌ట‌, రానా అల్లు అర్జున్ తో ఓ సినిమా ప్లాన్ చేసి ఇది ఫైన‌ల్ చేసుకున్నారు క్రిష్.

కాని ఇటీవ‌ల మనోజ్ తన దగ్గరికి వచ్చిన కథకి ఈ టైటిల్ బాగుటుందని భావించార‌ట‌, దీంతో ద‌ర్శకుడు క్రిష్ ను రిక్వెస్ట్ చేశాడట. గ‌తంలో. వేదం సినిమా నుంచి ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం వుంది. దీంతో మ‌నోజ్ అడ‌గ‌గానే క్రిష్ ఆ టైటిల్ ఇచ్చేశార‌ట‌. టైటిల్ మాత్రం సూప‌ర్ అంటున్నారు అభిమానులు.