మంచు మోహన్ బాబు గురించి ఈ పది విషయాలు తప్పక తెలుసుకోవాలి

మంచు మోహన్ బాబు గురించి ఈ పది విషయాలు తప్పక తెలుసుకోవాలి

0
122

డైలాగ్ కింగ్ అంటే మోహన్ బాబు అని చెప్పాలి, ఇటు సినిమాహీరో ,నిర్మాత, విలక్షణ నటుడిగా ఎంతో పేరు సంపాదించారు మోహన్ బాబు, స్వర్గం నరకం సినిమాతో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చారు.
అనేక సినిమాల్లో హీరోగా చేస్తూ నిర్మాతగా కూడా మారాడు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశాడు.

అంతేకాదు మోహన్ బాబు విలన్గా, క్యారెక్టర్ నటుడిగా హీరోగా చేశారు… ఆయన కళాప్రతిభకు పద్మ శ్రీ పురస్కారం 2007లో లభించింది.. రంగంపేటలో శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థలు స్థాపించారు, పేదల పిల్లలకుఇందులో ఉచిత విద్య అందిస్తున్నారు.. రాజకీయాల్లో ప్రవేశించి రాజ్యసభ సభ్యుడిగా కూడా చేశారు.

ఆయన ఇద్దరు కుమారులు మంచు విష్ణు, మనోజ్. కుమార్తె లక్ష్మీ ప్రసన్న వీరు కూడా చిత్ర పరిశ్రమలో ఉన్నారు..మోహన్బాబు 2015 వరకూ 520 చిత్రాలకు పైగా నటించారు. దాదాపు 181 సినిమాల్లో ఆయన హీరోగా చేశారు. ఇక ఆయనకు కలెక్షన్ కింగ్ అనే బిరుదు కూడా ఉంది టాలీవుడ్ లో.

మోహన్ బాబు 1995 నుండి 2001 వరకు రాజ్య సభ సభ్యునిగా పనిచేశారు…మోహన్ బాబు 1992లో శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ను స్థాపించారు. దీనిలో అంతర్జాతీయ పాఠశాల, డిగ్రీ కళాశాల, ఇంజినీరింగ్ కళాశాల, ఫార్మసీ కళాశాల, నర్సింగ్ కళాశాలలు ఉన్నాయి.ఇక ఆయనకు రజనీకాంత్, చిరంజీవి మంచి సన్నిహితులు, అన్న ఎన్టీఆర్ అంటే ఆయనకు ప్రత్యేక అభిమానం.