కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, హీరో మంచు విష్ణులకు ఊహించని షాక్ తగిలింది. ఇటీవల మంచు విష్ణు హెయిర్ స్టైలిస్ట్ నాగ శ్రీను పై వారు దొంగతనం కేసు పెట్టడం.. అనంతరం నాగ శ్రీను ఓ వీడియో విడుదల చేస్తూ మోహన్ బాబు కుటుంబం తనను చిత్ర హింసలకు గురి చేసిందని.. కులం పేరుతో దుర్భాషలడరని అంటూ ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నాయి బ్రాహ్మణ సంఘాల నేతలు తెలంగాణ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. బిసి కులాల్లో అత్యంత వెనుకబడిన నాయి బ్రాహ్మణ కులాన్ని మోహన్ బాబు, విష్ణు నీచంగా కించపరచారని…వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ వారు ఫిర్యాదు చేశారు.
అంతేకాదు గుంటూరు, ఒంగోలులో ఆందోళన చేశారు. మంచు ఫ్యామిలీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, ర్యాలీ నిర్వహించారు నాయీ బ్రాహ్మణులు. మోహన్ బాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. డబ్బు, అధికార బలం ఉందన్న అహంకారంతో, నాగశ్రీనుని కులం పేరుతో దూషించడాన్ని ఖండించారు కృష్ణయ్య. మోహన్‌బాబు క్షమాపణలు చెప్పాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు కృష్ణయ్య. ఎన్నో ఏళ్ల పాటు మంచు ఫ్యామిలీ దగ్గర పనిచేస్తే.. తనపై దొంగతనం కేసు పెట్టి, మానసికంగా వేధించారని ఆరోపిస్తున్నాడు నాగశ్రీను. మోహన్ బాబు తనను మోకాళ్లపై నిలబెట్టి అవమానించారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.