టాలీవుడ్ టాక్ — మా అధ్యక్షుడి ఎన్నిక‌ల బ‌రిలోకి మంచు విష్ణు

Manchu Vishnu Contesting MAA presidential elections

0
49

ఇప్పుడు తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో ఒక‌టే టాక్ .అవును టాలీవుడ్ లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మా ఎన్నికలు త్వరలో ప్రారంభం కానున్నాయి. సినిమా న‌టులు అంద‌రూ కూడా ఈ ఎన్నికల్లో పాల్గొంటారు. ప్రకాశ్ రాజ్ మా అధ్యక్ష పదవికి పోటీపడనున్న విషయం తెలిసిందే. ఇక మ‌రొక‌రు బ‌రిలో ఎవ‌రు ఉంటారు అనేది ఇప్పుడు చ‌ర్చ న‌డుస్తోంది.

అయితే తాజాగా టాలీవుడ్ లో వినిపిస్తున్న వార్త‌ల ప్ర‌కారం . అధ్యక్ష బరిలోకి హీరో మంచు విష్ణు కూడా దిగనున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై టాలీవుడ్ లో వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ప్ర‌క‌ట‌న కూడా త్వ‌ర‌లో రానుంది అని తెలుస్తోంది.

అయితే మంచు విష్ణు మెగాస్టార్ చిరంజీవిని క‌లిసిన త‌ర్వాత దీనిపై ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశం ఉంది. దీనిపై ఆ త‌ర్వాతే విష్ణు ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉందంటున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి మంచు మోహ‌న్ బాబు ఇద్ద‌రు మంచి మిత్రులు. అయితే చిరుతో చ‌ర్చించిన త‌ర్వాత మంచు విష్ణు నిర్ణ‌యం ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది అని వార్త‌లు వినిపిస్తున్నాయి.