విష్ణు సంచలన నిర్ణయానికి బ్రేక్.. మహాలక్ష్మీ వచ్చేసింది

విష్ణు సంచలన నిర్ణయానికి బ్రేక్.. మహాలక్ష్మీ వచ్చేసింది

0
86

రెండో శ్రావణ శుక్రవారం, వరలక్ష్మీ వ్రతం రోజున మంచు కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. మంచు విష్ణు సతీమణి విరానికా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించిన విష్ణు.. ”అమ్మాయి పుట్టింది. అమ్మాయి పుట్టింది” అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. కాగా మంచు విష్ణు, విరావికా దంపతులకు ఇదివరకే ఇద్దరు అమ్మాయిలు(కవలలు), ఒక అబ్బాయి ఉన్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే కాజల్‌ సలహాతో తన భార్య డెలివరీని ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌ పెడతానంటూ గురువారం సంచలనానికి తెరలేపాడు విష్ణు. ఆ తరువాత దానికి విరావిక స్పందిస్తూ.. అలా చేస్తే నిన్ను కొట్టేస్తాను. కాజల్‌ నువ్వు ఏం అనుకోకు అని కామెంట్ పెట్టింది. దీంతో మరోసారి విష్ణు ట్వీట్ చేస్తూ.. విరావిక నుంచి వచ్చిన బెదిరింపుల నేపథ్యంలో నేను ఇన్‌స్టాలో లైవ్ చేయలేకపోతున్నాను. ఆమెను నేను పెట్టుకోలేను. ఎందుకంటే తనకు మోహన్ బాబు మద్దతు ఉందంటూ తెలిపాడు.