అప్పుడు రామ్ చరణ్ చేశాడు.ఇప్పుడు విష్ణు చేస్తున్నాడు!!

అప్పుడు రామ్ చరణ్ చేశాడు.ఇప్పుడు విష్ణు చేస్తున్నాడు!!

0
81

టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎంటర్ టైన్ మెంట్ మూవీస్ కి పెట్టింది పేరైన దర్శకులలో శ్రీను వైట్ల ఒకరు, కెరీర్ ప్రారంభం లో వరుస విజయాలతో దుమ్ము లేపిన శ్రీనువైట్ల తర్వాత ఒకటి రెండు ఫ్లాఫ్స్ ని ఎదురుకున్నా తర్వాత మళ్ళీ ఢీ సినిమా నుండి వెనుతిరిగి చూసు కోకుండా దుమ్ము లేపాడు, మళ్ళీ ఆగడు సినిమా నుండి వరుస పరాజయాల తో సతమతం అవుతున్న శ్రీను వైట్ల తన అప్ కమింగ్ మూవీ ని ఎవరి తో చేస్తాడు అన్నది ఇప్పుడు అందరి లోను ఆసక్తిగా మారగా శ్రీను వైట్ల సక్సెస్ లో ముఖ్య భాగం తీసుకునే టీం కథ స్క్రీన్ ప్లే ని అందించే కోన వెంకట్ మరియు గోపి మోహన్ లు అన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ బాద్ షా సినిమా సమయం లో ఈ టీం లో మనస్పర్ధలు రావడం తో అందరు విదిపోగా ఆగడు సినిమా చేసిన శ్రీను వైట్ల ఫ్లాఫ్ ల భాట పట్టాడు. దాంతో ఆ ఇంపాక్ట్ తన సినిమా పై పడకూడదని రామ్ చరణ్ బ్రూస్ లీ సినిమా కి మరోసారి ఈ కాంబో ని సెట్ చేసినా ఫలితం మాత్రం శూన్యం అయిందని చెప్పొచ్చు.

దాంతో ఈ టీం పూర్తిగా విడిపోగా.. విడి పోయిన తర్వాత ఈ టీం వేరు వేరు గా చేసిన సినిమాలు అన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొడుతూ వచ్చాయి. దాంతో అందరు ఫ్లాఫుల్లో ఉన్న సమయం లో మంచు విష్ణు పిలిచి మరీ ఢీ సినిమా సీక్వెల్ ఆఫర్ ఇచ్చాడు.