మన్మథుడు సినిమాలో హీరోయిన్ అన్షు అంబానీ ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసా

Manmadhudu heroine Anshu Ambani

0
118
Anshu Ambani

మన్మథుడు సినిమాలో ఎంతో అమాయకంగా నటించిన హీరోయిన్, అన్షు అంబానీ చాలా మందికి గుర్తు ఉండే ఉంటుంది. తెలుగులో రెండు సినిమాలు మాత్రమే చేసిన ఆమె, తర్వాత సినిమాలు చేయలేదు. అయితే చేసిన రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. మరి ఆమె ఇప్పుడు ఎక్కడ ఉంది అనేది చూద్దాం.

మన్మథుడు సినిమాలో నటించిన తర్వాత ఆమెకి, ప్రభాస్ తో రాఘవేంద్ర సినిమాలో నటించే అవకాశం వచ్చింది .ఈ చిత్రంలో కూడా ఆమెకి మంచి ఫేమ్ వచ్చింది. తర్వాత ఆమె తమిళ చిత్రం జై లో నటించింది. తర్వాత ఆమె సినిమాలకు దూరం అయింది. అన్షు లండన్ లో పుట్టి పెరిగింది. అక్కడ ప్రముఖ వ్యాపారవేత్త సచిన్ సగ్గార్ను పెళ్లాడి, లండన్లోనే సెటిల్ అయిపోయింది.

అయితే ఆమె కూడా ఓ వ్యాపారం ప్రారంభించింది. అన్షు అక్కడ ఫ్యాషన్ డిజైనర్గా రాణిస్తున్నారట. ఇన్స్పిరేషన్ కౌచర్ అనే డిజైనింగ్ షాప్ పెట్టారు. అన్షు సినిమాలు చేసి 18 ఏళ్లు అయింది. ఆమెని సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టమని మళ్లీ సినిమాలు చేయాలని అభిమానులు కోరుతున్నారు.