మనోజ్ బాజ్‌పేయ్ ఇంట తీవ్ర విషాదం

0
107

‘ఫ్యామిలీ మ్యాన్’ నటుడు మనోజ్ బాజ్‌పేయి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయ‌న తండ్రి రాధాకాంత్ బాజ్‌పేయి ఈరోజు ఉదయం కన్నుమూశారు. 83 ఏళ్ల వయసులో ఉన్న రాధాకాంత్ కొద్ది రోజుల క్రితం అనారోగ్యానికి గుర‌య్యారు.

వృద్ధాప్య సమస్యలతో బాధ‌ప‌డుతున్న రాధాకాంత్‌ని ఢిల్లీలోని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న ఆయన ఈరోజు తుది శ్వాస విడిచారు. మనోజ్ కు తల్లిదండ్రులంటే ఎంతో ప్రేమ. ఈ విషయాన్నీ ఆయన పలు ఇంటర్వ్యూలలో వెల్లడించారు.

తండ్రిని పోగొట్టుకున్న మ‌నోజ్ తీవ్ర విషాదంలో ఉన్నారు. మ‌నోజ్ బాజ్ పాయ్ కొద్దిరోజుల క్రితం ఫ్యామిలీ మ్యాన్ 2 అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వచ్చి తన నటనతో అందరిని కట్టిపడేశాడు.