మరో యాక్షన్ సినిమా తో రాబోతున్న లక్ష్ చదలవాడ.. ‘ధీర’!!

-

వరుస సినిమాలకు కమిటవుతూ కెరీర్ పరంగా దూసుకుపోతున్నాడు యంగ్ హీరో లక్ష్ చదలవాడ. ‘వలయం’ సినిమాతో విమర్శకుల ప్రశంసలందుకున్న ఆయన.. త్వరలోనే ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ క్రమంలోనే మరో ప్రాజెక్టు ఓకే చేసి ఆ సినిమాను సెట్స్ మీదకు తీసుకొచ్చాడు. ‘ధీర’ అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాను నేడు హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. తొలి సన్నివేశానికి ఖ్యాతి చదలవాడ క్లాప్ ఇవ్వగా.. చదలవాడ శ్రీనివాస రావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ నెల 14వ తేదీ వరకు హైదరాబాద్‌లో మొదటి షెడ్యూల్ షూటింగ్ జరగనుంది.

- Advertisement -

విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సరికొత్త కథాంశంతో ఈ సినిమా రూపొందిస్తున్నారు. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 12గా ఈ సినిమా నిర్మిస్తున్నారు. పలు సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించిన సాయి కార్తీక్ ఈ సినిమాకు బాణీలు కడుతున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ హంగులతో ఈ సినిమా నిర్మాణం పూర్తి చేయనున్నారట మేకర్స్.

విలక్షణ కథలకు కేరాఫ్ అడ్రస్ అవుతున్న హీరో లక్ష ఈ సినిమాతో మరో మెట్టు ఎక్కడం ఖాయమని చిత్రయూనిట్ చెబుతోంది. నేటితరం కోరుకునే అన్ని అంశాలు జోడించి ఈ సినిమా రూపొందిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని అన్నారు.

నటీనటులు :
లక్ష్ చదలవాడ

సాంకేతిక నిపుణులు :
సమర్పణ : చదలవాడ బ్రదర్స్
బ్యానర్ : శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్
నిర్మాత : పద్మావతి చదలవాడ
దర్శకుడు : విక్రాంత్ శ్రీనివాస్
సంగీతం: సాయి కార్తీక్
సినిమాటోగ్రఫీ : కన్నా పీసీ
డైలాగ్స్: విక్రాంత్ శ్రీనివాస్, శృతిక్
ఎడిటర్: మధు రెడ్డి
ఫైట్ మాస్టర్ : జాషువా
పీఆర్వో : సాయి సతీష్, పర్వతనేని రాంబాబు

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...