బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అంత్యక్రియలు జరిగి 24 గంటలు కూడా అవ్వలేదు, ఆయన మరణం ఎవరూ తట్టుకోలేకపోతున్నారు, ఈ స్దితిలో బీ టౌన్ అంతా షాక్ లో ఉంది, అసలు ఇలా ఎలా జరిగింది, ఆయన ఇంత షాకింగ్ డెసిషన్ తీసుకోవడానికి ప్రధానకారణం ఏమై ఉంటుంది అని అందరూ ఆలోచన చేశారు.
ఈ సమయంలో మరో దారుణం జరిగింది.. సుశాంత్ మరదలు సుశాంత్ కజిన్ భార్య సుధా దేవి బీహార్ లోని పుర్నియాలో తుది శ్వాస విడిచారు. ముంబయిలో సుశాంత్ అంత్యక్రియలు జరుగుతున్న సమయంలోనే ఆమె కుప్పకూలి మరణించిందని తెలుస్తోంది.
తననెంతో ఆప్యాయంగా చూసుకునే సుశాంత్ మరణాన్ని ఆమె తట్టుకోలేకపోయిందని, సుశాంత్ మరణ వార్త విన్న తరువాత ఆమె ఆహారం తీసుకోవడం మానేసిందని, ఆ బాధ నిన్న అంత్యక్రియలు జరిగిన తర్వాత కన్నీరు పెట్టుకుంటూనే ఉంది, ఈ విషాదంతో ఆమె ప్రాణాలు వదిలింది, దీంతో కుటుంబం మరింత షాక్ లో ఉంది.