మరో దర్శకుడికి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ – బాలీవుడ్ టాక్

మరో దర్శకుడికి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ - బాలీవుడ్ టాక్

0
93

ప్రభాస్ ఇప్పుడు వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు అన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే అని చెప్పాలి ..దాదాపు 1000 కోట్ల రూపాయల సినిమాలు ప్రభాస్ చేతిలో ఉన్నాయి… అయితే ఈ సినిమాలతో పాటు ఆయనకు పలువురు దర్శకులు కధలు చెబుతున్నారు.. ఓ పక్క బాలీవుడ్ లో ఫుల్ బిజీ అయ్యారు ప్రభాస్… ఇక తాజాగా ఆయన రాధేశ్యామ్ చిత్రం పూర్తి చేసుకున్నారు.

 

సలార్ .. ఆది పురుష్ ఈ రెండు కూడా సెట్స్ పైనే ఉన్నాయి. ఇక ఈ రెండు చిత్రాలు పూర్తి చేసిన తర్వాత ఆయన నాగ్ అశ్విన్ తో సినిమా చేస్తారు, అయితే దీని తర్వాత మరో ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తారు అని అందరూ అనుకుంటున్నారు, అయితే ఈ సమయంలో ఓ వార్త వినిపిస్తోంది బాలీవుడ్ మీడియాలో.

 

వార్ వంటి భారీ యాక్షన్ సినిమాను తెరకెక్కించిన సిద్ధార్థ్ ఆనంద్ ఇటీవల ప్రభాస్ కు ఓ స్టోరీ చెప్పారట…, ప్రభాస్ దీనికి ఒకే చెప్పారు అని వార్తలు బీ టౌన్ లో వినిపిస్తున్నాయి. మొత్తానికి అన్నీ సెట్ అయితే ఇది 2022 లేదా 2023 లో స్టార్ట్ అవ్వచ్చు అంటున్నారు.