మరో కొత్త దర్శకుడితో నాగార్జున సినిమాకి గ్రీన్ సిగ్నల్

మరో కొత్త దర్శకుడితో నాగార్జున సినిమాకి గ్రీన్ సిగ్నల్

0
97

కింగ్ నాగార్జునకి ఇటీవల విజయాలు పలకరించడం లేదు.. వరుసగా పరాజయాలే వస్తున్నాయి.. దీంతో సినిమాలపై కథలపై ఆయన బాగా ఫోకస్ చేశారు.. అలాగే పాత్రల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
తాజాగా మరో కొత్త దర్శకుడికి అవకాశమిస్తూ, ఆయన వైల్డ్ డాగ్ సినిమా చేస్తున్నాడు. పూర్తిస్థాయి యాక్షన్ తో రూపొందే ఈ సినిమాలో ఆయన ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.

అయితే ఇలాంటి పాత్రలు కథలు చేయడంలో నాగార్జున చాలా హిట్ అనే చెప్పాలి ..గతంలో కూడా ఆయన చేసిన సినిమాల్లో ఈ పాత్రలకు మంచి పేరు వచ్చింది, అయితే తదుపరి సినిమా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున నటించనున్నట్టు తెలుస్తోంది, అవును దర్శకుడు ప్రవీణ్ ఆయనకు ఓ సినిమా కథ వినిపించారట.

ఈ కథ నచ్చడంతో నాగార్జున ఈ చిత్రం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట…ఇది కూడా యాక్షన్ నేపథ్యంలోనే సాగుతుందని, ఆదాయపన్ను శాఖ అధికారిగా ఈ సినిమాలో నాగార్జున కనిపించనున్నాడని చెబుతున్నారు. గరుడ వేగ సినిమా తర్వాత ప్రవీణ్ సత్తారు చేస్తున్న సినిమా కావడంతో దీనిపై టాలీవుడ్ లో అగ్రగణ్యులు అదే చెబుతున్నారు.. డిఫరెంట్ పాయింట్స్ తీసుకుని సినిమా తెరకెక్కించే దర్శకుడు అని ప్రవీణ్ సత్తార్ గురించి చెబుతున్నారు.