ఎక్కడో పుట్టిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలను చిన్నాభిన్నం చేస్తున్న సంగతి తెలిసిందే… ఈ మహమ్మారి దెబ్బకు జనజీవనం స్థంభించిపోయింది… లాక్ డౌన్ కారణంగా ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ దారుణంగా దెబ్బతింది…
ప్రస్తుతం ఈ మాయదారి మహమ్మారిని ఎదుర్కునేందు డాక్టర్లు ముందువరుసలో ఉండి పోరాడుతున్నారు… ఇక వైద్యా నిపుణులు శాస్త్రవేత్తలు కరోనా వ్యాక్సిన్ ను కనుగొనే పనిలో పడ్డారు ఇప్పటికే కొన్ని వ్యాక్సిన్లు తుది దశలో ఉన్న సంగతి తెలిసిందే…
ఈ క్రమంలోనే తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు… కరోనాకు వ్యాక్సిన్ రాలేదని ఇక ముందు కూడా రాదని అంటూ బాంబ్ పేల్చారు… వ్యాక్సిన్ వస్తుందని అంటున్నారు కానీ అది నిజం కాదని తెలిపారు… ప్రతీ ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని అన్నారు….