ప్రముఖ గాయని లతా మంగేష్కర్​కు రాజ్యసభ నివాళి

Married Singer Rewanth

0
83

ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌ మృతికి రాజ్యసభ నివాళులర్పించింది. ఉదయం 10 గంటలకు రాజ్యసభ ప్రారంభం కాగానే ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు లతా మంగేష్కర్‌ను స్మరించుకుంటూ సందేశం చదివారు. ‘లతాజీ మరణంతో ఈ దేశం ఓ గొప్ప గాయని, దయామూర్తిని, మహోన్నత వ్యక్తిత్వాన్ని కోల్పోయింది. ఆమె మరణం.. ఓ శకానికి ముగింపు. సంగీత ప్రపంచంలో ఆమె లేని లోటు ఎన్నటికీ పూడ్చలేనిది’ అని ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు సంతాపం తెలియజేశారు. ఆ తర్వాత సభ్యులంతా రెండు నిమిషాలు మౌనం పాటించారు. లత గౌరవార్థం సభను గంట పాటు వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్‌ ప్రకటించారు.

లతా మంగేష్కర్ జనవరి 11న కొవిడ్‌ స్వల్ప లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆమె కరోనా నుంచి కోలుకొన్నట్లు వైద్యులు, కుటుంబసభ్యులు ప్రకటించారు. కానీ ఆదివారం ఉదయం ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో తుదిశ్వాస విడిచారు.