దర్శకుడు మారుతి సినిమాల జోరు బాగా పెంచారు అనే చెప్పాలి.. తాజాగా ఆయన తేజ్ తో చేసిన ప్రతీ రోజు పండుగే చిత్రం భారీ విజయం సాధించింది. ముఖ్యంగా ఎమోషన్ కి కామెడీని కలిపి నడుపుతూ ఆయన ఆవిష్కరించిన ఈ సినిమాకి అన్నివర్గాల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది.
ఇక ప్రస్తుతం ఈ క్రిస్మస్ కు వెంకీ మామతో పాటు సందడి చేస్తోంది ఈ సినిమా, అందరూ ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేస్తున్నారు, అంతేకాదు ఈ సక్సెస్ తో ఆయన ఫుల్ జోష్ మీద ఉన్నారు, అయితే మారుతి మరో సినిమాని కూడా ఆయన ట్రాక్ లో పెడుతున్నారట.
ఆయన తదుపరి సినిమా రామ్ తో వుండనుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. మారుతి చేతిలో ముగ్గురు .. నలుగురు నిర్మాతలు వున్నారు. మరి వారిలో హీరో రామ్ తో సినిమా ఎవరు చేస్తారు అనేది ఇప్పుడు టాక్, అయితే ప్రముఖ నిర్మాత రామ్ తో సినిమాకి ఒకే చెప్పారట, అందుకే రామ్ తో సంప్రదింపులు జరిపి తర్వాత సినిమాని ఆ నిర్మాతతో అనౌన్స్ చేస్తారు అని తెలుస్తోంది, వచ్చే ఏడాది ఈ సినిమా పట్టాలెక్కనుందట.