మాస్ మహారాజ్..5 గురు హీరోయిన్లతో రొమాన్స్

0
94

మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్ళిపోతున్నాడు. డైరెక్టర్ శరత్ మండవ దర్శకత్వంలో మాస్ మహారాజ్ తాజాగా నటిస్తున్న సినిమా “రామారావు ఆన్ డ్యూటీ”. ఈ సినిమా నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. కానీ ఖిలాడీ సినిమా అనుకుంతా విశేష ప్రేక్షాదరణ సొంతం చేసుకోలేకపోయింది.

క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్  వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా” రావణాసుర” అనే మరో యాక్షన్ మూవీతో ప్రేక్షకులను అలరించనున్నాడు. షూటింగ్ కూడా శరవేగంగా పూర్తిచేసుకుంది ‘రావణాసుర’ సినిమా. ఈ సినిమాలో రవితేజ లాయర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో రవితేజ ఏకంగా 5 గురు హీరోయిన్ లతో రొమాన్స్ చేయనున్నాడు.

అనూ ఇమ్మాన్యూయేల్, మేఘా ఆకాష్, ఫరీయా అబ్దుల్లా, దీక్షా నగార్కర్, పూజిత పొన్నాడ నటించారు. ఐదుగురు హీరోయిన్లు అంటే ఈ సినిమా పక్కా మాస్‌గా ఉంటుందని ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు. అంతేకాకుండా హీరో సుశాంత్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నాడు. హర్షవర్ధన్ రామేశ్వర్, బీమ్స్ ఈ చిత్రానికి సంగీత అందించారు.