మాటరాని మౌనమిది సినిమా నుంచి దంపుడు లక్ష్మి ఐటమ్ పాట విడుదల 

-

రుద్ర పిక్చర్స్ పతాకంపై మహేష్ దత్తా, సోని శ్రీవాస్తవ, శ్రీహరి ఉదయగిరి హీరో హీరోయిన్ గా సుకు పూర్వాజ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం “మాటరాని మౌనమిది”. ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనిలో నిమగ్నమై ఉంది. అయితే ఈ రోజు ఈ చిత్రం లోని ‘దంపుడు లక్ష్మి’ ఐటమ్ పాటను మధుర మ్యూజిక్ ద్వారా విడుదల చేశారు.

- Advertisement -

ఈ దంపుడు లక్ష్మి పాట చూసిన ప్రేక్షకులు మంచి నాటు పాట, చాలా బాగుంది అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ  పాటకు అషీర్ లుక్ సంగీతం అందించగా డి సైయద్ బాషా లిరిక్స్ అందించారు. రేవంత్, మనీష పాండ్రంకి మరియు యువ రాహుల్ కనపర్తి దంపుడు లక్ష్మి పాట ను పాడారు. ఇప్పుడు ఈ దంపుడు లక్ష్మి పాట సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది.

ఈ సందర్భంగా దర్శకుడు సుకు పూర్వాజ్ మాట్లాడుతూ “ఇది నా రెండో సినిమా. మంచి థ్రిల్లర్ ప్రేమ కథ, కథనం తో మీ ముందుకు వస్తున్నాను. మేము ఇటీవల విడుదల చేసిన టీజర్ గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు ‘దంపుడు లక్ష్మి’ ఐటమ్ పాటను మధుర మ్యూజిక్ ద్వారా విడుదల చేసాము. మంచి రెస్పాన్స్ వస్తుంది, మంచి నాటు పాట, చాలా బాగుంది అని కామెంట్స్ చేస్తున్నారు. మా సంగీత దర్శకుడు అషీర్ లుక్ అద్భుతమైన పాటలు ఇచ్చారు, రాజ్ కృష్ణ డాన్స్ స్టెప్స్ ఆ పాటకు ప్రాణం పోశాయి. మా ‘దంపుడు లక్ష్మి’ ఐటమ్ పాట సోషల్ మీడియా లో ట్రేండింగ్ లో ఉంది” అని తెలిపారు.

బ్యానర్ : రుద్ర పిక్చర్స్

సినిమా పేరు : మాటరాని మౌనమిది

నటి నటులు : మహేష్ దత్తా, సోని శ్రీవాస్తవ, శ్రీహరి ఉదయగిరి, సంజీవ్, అర్చన అనంత్, కేశవ్, కాశి, ప్రమోద్, చందు సుమన్ శెట్టి, తదితరులు

కెమెరా మాన్ : శివరామ్ చరణ్

సంగీతం : అషీర్ లుక్

ఎడిటర్ : శివ సర్వాణి

కథ, కధనం, దర్శకత్వం : సుకు పూర్వాజ్

నిర్మాత : రుద్ర పిక్చర్స్

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sesame Seeds | చలికాలంలో తెల్ల నువ్వులు ఎంత మ్యాజిక్ చేస్తాయో తెలుసా..

Sesame Seeds | చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా పెద్ద టాస్క్...

Jagapathi Babu | రేవతి కుటుంబాన్ని నేను పరామర్శించా: జగపతిబాబు

Jagapathi Babu | సంధ్య థియేటర్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా...