Matti Kusthi movie :మట్టికుస్తీ అన్నీ కలగలిసిన సినిమా..!

-

Matti Kusthi movie pre release event: విష్ణు విశాల్‌ హీరోగా, ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా తెరకెక్కిన మట్టికుస్తీ డిసెంబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో రవితేజ మాట్లాడుతూ, కథానాయకుడిగా ప్రోత్సహించి ప్రేక్షకులు అండగా నిలిచారు. నిర్మాతగానూ అంతే సహకారం అందించాలని కోరారు. క్రీడా నేపథ్యమే కాదు.. ప్రేమ, భావోద్వేగాలు, కుటుంబ అనుబంధాలు అన్నీ కలగలిసిన సినిమా ఇది అని అన్నారు. డైరెక్టర్‌ చెల్లా అయ్యావు కథ చెప్తున్నప్పుడే చాలా నవ్వుకున్నానని అన్నారు.

- Advertisement -

సినిమా చాలా బాగుంటుందనీ.. అందరూ ఆస్వాదిస్తారని అనుకుంటున్నాని రవితేజ అన్నారు. కుటుంబంతో కలిసి థియేటర్లలో చూసే సినిమా ఇది అని హీరోయిన్‌ ఐశ్వర్య లక్ష్మి అన్నారు. ఈ సందర్భంగా విష్ణు విశాల్‌, ఐశ్వర్య లక్ష్మిలతో కలిసి రవితేజ డాన్స్‌ చేశారు. రవితేజ మంచి మనసున్న వ్యక్తి అని.. తొలిసారి నన్ను నమ్మి ప్రోత్సహించారని విష్ణు విశాల్‌ అన్నారు. ఈ Matti Kusthi movie సినిమా చేసినందుకు తను ఎంతో అదృష్టవంతుడునీ.. తన తల నిజమైన భావన కలుగుతోందని అన్నారు. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లే ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

భువనేశ్వరి బూతుల ఆడియో వైరల్.. తీవ్రంగా స్పందించిన టీడీపీ..

ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. పోలింగ్‌కు రెండు వారాలు మాత్రమే సమయం ఉండటంతో...

వైసీపీకి భారీ షాక్.. మరో కీలక దళిత నేత రాజీనామా

ఎన్నికల పోలింగ్ వేళ అధికార వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ తగిలింది. గుంటూరు...