బ్రేకింగ్ – రోడ్డు ప్రమాదంలో నటి మృతి షాక్ లో నటులు

బ్రేకింగ్ - రోడ్డు ప్రమాదంలో నటి మృతి షాక్ లో నటులు

0
136

ఈ లాక్ డౌన్ వేళ సినిమా ఇండస్ట్రీలో విషాద ఘటనలు జరుగుతున్నాయి, కొందరు నటులు ప్రమాదాల్లో మరణిస్తే మరికొందరు ఆత్మహత్య చేసుకున్నవారు ఉన్నారు, తాజాగా ప్రముఖ కన్నడ టెలివిజన్ నటి మెబీనా మైఖెల్ రోడ్డు ప్రమాదంలో కన్నుమూసింది. ఆమె మరణంతో కన్నడ బుల్లితెర చిత్ర పరిశ్రమ షాక్ లో ఉంది,

కేవలం 22 ఏళ్ల వయసులోనే ఈమె మరణించడం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఆమె తన స్వగ్రామం మదికేరికి వెళుతూ ఉన్న సమయంలో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్కు కారు ఢీ కొట్టడంతో తీవ్రగాయాల పాలైంది మెబీనా, ఆస్పత్రికి వెళుతున్న సమయంలో ఆమెప్రాణాలు కోల్పోయింది.

దేవిహిల్లి దగ్గర ఈ దుర్ఘటన జరిగింది. ప్యాతే హుదుగిర్ సీజన్ 4 అనే రియాలిటీ షోతో మెబీనా గుర్తింపు తెచ్చుకుంది. కన్నడలో ఆమె కంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది..అందులో విజేతగా కూడా నిలిచింది
మెబీనా మృతిపై సోషల్ మీడియాలో నటులు స్నేహితులు సంతాపం తెలుపుతున్నారు.
19 ఏళ్ల వయసులోనే రియాలిటీ షోకు వెళ్లి 12 మందిని దాటేసి విజేతగా నిలిచింది. ఆమె మరణం తీరని లోటు అంటున్నారు పరిశ్రమ వర్గాలు.