మీడియా కు కృష్ణంరాజు స్వీట్ వార్నింగ్

మీడియా కు కృష్ణంరాజు స్వీట్ వార్నింగ్

0
96

ప్రముఖ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు అస్వస్థతకు గురయ్యారని, కొంతకాలంగా ఆయన నుమోనియాతో బాధపడుతున్నారని వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. అయితే ఆయన కేర్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు అని వార్తలు వచ్చాయి.. కాని దీనిపై ఆయన మండిపడ్డారు. తన ఆరోగ్యం గురించి మీడియాలు ఇష్టం వచ్చినట్లు రాశాయి అని అన్నారు, తను రెగ్యులర్ చెకప్ కోసం ఇక్కడకు వచ్చాను, అంతే దానికి ఏకంగా తనకి ఏదో జరిగింది అనేలా వార్తలు రాశారు అని విమర్శించారు.

ముందు నిజా నిజాలు తెలుసుకోవాలని తన కుటుంబ సభ్యులు అక్కడ ఉన్నారు, ఈ సమయంలో వారిని అడిగితే వివరాలు చెప్పేవారు కాని ఒకరిని చూసి మరొకరు ఇష్టం వచ్చినట్లు వార్తలు రాశారు అని , ఇలా చేయడం వల్ల తన అభిమానులు కంగారు పడ్డారని, ఇలాంటి వార్తలు రాయకండి అని తెలియచేశారు. అయితే తను నుమోనియాతో బాధపడుతున్నా, కాని ఆరోగ్యంగానే ఉన్నా, తన అభిమానులు కంగారు పడాల్సిన పనిలేదు అని తెలియచేశారు రెబల్ స్టార్ ,నేరుగా ఆయనే ఈ విషయం చెప్పడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.