మెగా డాటర్ నిహారిక పెళ్లి ఫిక్స్ ?

మెగా డాటర్ నిహారిక పెళ్లి ఫిక్స్ ?

0
88

మెగా వారి ఇంట పెళ్లి సంద‌డి అంటూ తెగ వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి, మెగా డాట‌ర్ నిహ‌రిక వివాహం గురించి అనేక వార్త‌లు ఇప్ప‌టికే వైర‌ల్ అయ్యాయి.ఒకసారి ప్రభాస్‌తో వివాహం అని ప్రచారం చేయగా ఆ తర్వాత సాయిధరమ్‌తో అని ఒకసారి నాగశౌర్యతో అని మరోసారి జోరుగా ప్రచారాలు చేశారు. కాని ఇవేమీ నిజం కాదు అని తేలింది.

తాజాగా ఆమె ఓ పోస్ట్ ద్వారా త‌న పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది.కప్‌పై ఉన్న మిస్ నిహా పేరులో మిస్‌ని కట్ చేసి మిస్సెస్ అని రాసింది నిహారిక. ఆ మిస్సెస్ పక్కన ప్రశ్నార్ధకం గుర్తుని ఉంచి, ఆ వ్యక్తి ఎవరనే విషయాన్ని సస్పెన్స్‌గా ఉంచింది.

ఈ ఇన్ స్టా పోస్టుతో నిహ‌రిక పెళ్లి ఫిక్స్ అని తెలుస్తోంది, ఇక మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు కూడా త‌న పిల్ల‌ల పెళ్లి గురించి గ‌తంలో చెప్పారు వ‌చ్చే ఏడాది మొద‌ట్లో నిహ‌రిక పెళ్లి చేస్తామ‌ని సంబంధాలు చూస్తున్నాం అన్నారు.. సో నిహ‌రిక పెళ్లికి ఈ లాక్ డౌన్ టైమ్ లో మంచి సంబంధం చూశారు అని తెలుస్తోంది.