మెగా ఫ్యామిలీని వదలని కరోనా మరో హీరోకి పాజిటీవ్

మెగా ఫ్యామిలీని వదలని కరోనా మరో హీరోకి పాజిటీవ్

0
84

దేశంలో కరోనా కేసులు దారుణంగా పెరుగుతున్నాయి. ఏకంగా రోజుకి మూడు లక్షలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. అయితే చిత్ర సీమలో కూడా చాలా మందికి కరోనా సోకుతోంది.. ఇప్పటికే మెగా కుటుంబంలో చాలా మందికి కరోనా సోకింది. అందరూ కరోనా నుంచి జాగ్రత్తలు తీసుకుని కోలుకుంటున్నారు, తాజాగా మరో హీరోకి కరోనా సోకింది, దీంతో మెగా అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

 

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు, శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ కూడా కరోనా బారిన పడ్డాడు.విజేత సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈయన. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నారు. ఇలాంటి వేళ ఆయన కరోనా బారిన పడ్డారు అనే వార్త అందరిని షాక్ కి గురి చేసింది..సూపర్ మచ్చి, కిన్నెరసాని సినిమాలలో నటిస్తున్నారు ఆయన.

 

తనలో కొన్ని కోవిడ్ లక్షణాలు ఉండడంతో కోవిడ్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చిందని.. ప్రస్తుతం ఆసుపత్రిలో క్వారంటైన్లో ఉన్నట్లు చెప్పారు కల్యాణ్ దేవ్, ఇక ఈ వార్త విన్న వెంటనే అందరూ ఆయన త్వరగా కోలుకోవాలి అని ప్రార్దనలు చేస్తున్నారు, ఇక ఇప్పటికే మెగా కుటుంబంలో పవన్ కల్యాణ్ కి కరోనా సోకడంతో ఆయన చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.