మెగా అభిమానులకు గుడ్ న్యూస్… నిహారిక నిశ్చితార్థం తేదీ చెప్పిన వరుణ్ తేజ్…

మెగా అభిమానులకు గుడ్ న్యూస్... నిహారిక నిశ్చితార్థం తేదీ చెప్పిన వరుణ్ తేజ్...

0
94

కొద్దిరోజుల క్రితం నాగబాబు కుమార్తె నిహారిక ఇన్ స్టాగ్రామ్ లో ఒక ఫోటోను పోస్ట్ చేసింది… చైతన్య అనే గుంటూరు యువకుడిని పెళ్లి చేసుకోబోతున్నట్లు ఆయనతో కలిసి దిగిన ఒక ఫోటోను పోస్ట్ చేసింది…

ఇటీవలే నాగబాబు కూడా ఈ విషయంపై స్పందించాడు… త్వరలో నిహారిక పెళ్లి చెస్తామని ప్రకటించాడు… దీంతో మెగా అభిమానులు నిహారిక పెళ్లి ఎప్పుడా అని ఎదురుచూస్తున్నారు.. ఈక్రమంలో వరుణ్ తేజ్ నిహారిక నిశ్చితార్థం తేది చెప్పేశాడు..

తాజాగా ఒక ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ… ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో నిహారిక నిశ్చితార్ధం ఆగస్ట్ 13న జరుగనుందని చెప్పాడు… కోవిడ్ నిభందనలు పాటించి కొద్దిమంది బంధువుల సమక్షంలో ఈ నిశ్చితార్థవేడుకలు జరుగనున్నట్లు తెలుస్తోంది…