సాయిధరమ్ తేజ్ డిశ్చార్జ్..చిరంజీవి ఎమోషనల్ ట్వీట్

Mega hero Sayidharam Tej discharged

0
80

అపోలోలో చికిత్స పొందుతున్న మెగా హీరో సాయిధరమ్ తేజ్ నేడు ఉదయం డిశ్చార్జ్ అయ్యాడు. అతను పూర్తిగా కోలుకోవడంతో డాక్టర్లు ఇంటికి పంపించారు. రోడ్డు ప్రమాదం తర్వాత 35 రోజుల పాటు ఆస్పత్రిలో ఉన్న సాయి ధరమ్ తేజ్..దసరా పండగ రోజు అందులోనూ తన పుట్టిన రోజు నాడే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. సాయి ధరమ్ తేజ్ ఇవాళ ఇంటికి తిరిగొచ్చాడని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. కాగా గత నెలలో హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జి సమీపంలో బైక్ పైనుండి పడి తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. బర్త్ డే రోజే సాయిధరమ్ తేజ్ డిశ్చార్జి కావడంతో మెగా అభిమానులకు డబుల్ ట్రీట్ ఇచ్చినట్లు అయింది.

కాగా నేడు సాయి ధరమ్‌ తేజ్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా సాయి తేజ్‌కు బర్త్‌డే శుభాకాంక్షలు తెలుపుతూ చిరంజీవి ట్వీట్‌ చేశారు. ‘విజయ దశమి ప్రత్యేక రోజున సాయి ధరమ్‌ తేజ్‌ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. అతడు పూర్తి ఆరోగ్యంతో తిరిగి వచ్చాడు. ఇటీవల పెద్ద ప్రమాదం నుంచి బయట పడ్డ తేజ్‌కు ఇది పునర్జన్మ. ఇది ’ అంటూ తేజ్‌కు బర్త్‌డే విషెస్‌ తెలిపారు.

https://twitter.com/KChiruTweets/photo