ఉప్పెన సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో తెలిసిందే.. ఈ చిత్రం హిట్ అవ్వడంతో హీరోగా వైష్ణవ్ తేజ్ కి వరుస అవకాశాలు వస్తున్నాయి.. ఇక దర్శకుడు బుచ్చిబాబుకి కూడా ఎన్నో అవకాశాలు వస్తున్నాయి…కరోనా ఉధృతి తగ్గగానే రెండు చిత్రాలు సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధమవుతున్నాయి. తాజాగా ఆయన మరో సినిమా కూడా ఒకే చేశారు అనే వార్తలు వినిపిస్తున్నాయి.
దర్శకుడు వెంకీ కుడుములతో ఓ సినిమా చేయడానికి వైష్ణవ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు.
భీష్మ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టింది. నితిన్ కెరియర్లోనే సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది.. ఇక తాజాగా ఆయనతో సినిమా ఉంటుంది అని టాక్ నడుస్తోంది.
అయితే ఆయన మెగాహీరో వరుణ్ తేజ్ కు ముందు ఓ కథ చెప్పారు… ఆయన కూడా చేయాల్సిందే.. అయితే ఆ ప్రాజెక్ట్ మరికొంత సమయం పట్టే అవకాశం ఉందట… ఈ సమయంలో వెంకీ వైష్ణవ్ తో సినిమా చేయడానికి సిద్దం అవుతున్నారు. వరుణ్ తేజ్ తో గని పూర్తి అవ్వగానే సినిమా చేస్తారు అనే టాక్ నడుస్తోంది.. చూడాలి ఇంది ఎంత వరకూ వాస్తవమో.