మెగా హీరో వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా – భారీ రెమ్యునరేషన్ ?

Mega hero Vaishnav Teja new movie- Huge Remuneration

0
89

మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ఈ లవ్ స్టోరీ ప్రతీ సినిమా అభిమానులకి నచ్చింది. ఇక చాలా మంది నిర్మాతలు ఆయనతో సినిమాలు చేయాలని చూస్తున్నారు. పలువురు దర్శకులు కూడా ఆయనకు కధలు వినిపిస్తున్నారు.

అయితే ఆయన ఆచితూచి సినిమాలు ఎంచుకుంటున్నారు.ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో కొండపొలం అనే చిత్రాన్ని చేశారు వైష్ణవ్. తాజాగా అక్కినేని నాగార్జున బ్యానర్ అన్నపూర్ణ స్థూడియోస్ నిర్మించే సినిమాలో నటించడానికి అంగీకరించినట్టు టాలీవుడ్ లో వార్తలు వచ్చాయి.

ఈ సినిమా స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే కథతో రూపొందుతుందని అంటున్నారు. ఇందులో వైష్ణవ్ హాకీ ఆటగాడిగా కనిపిస్తాడని టాక్ నడుస్తోంది.ఈ సినిమాతో పృథ్వీ అనే యువకుడు దర్శకుడిగా ప‌రిచ‌యం అవ్వ‌నున్నార‌ట‌.ఈ చిత్రానికి వైష్ణవ్ కు ఐదు కోట్ల రూపాయల భారీ పారితోషికాన్ని ఇస్తున్నట్టు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. దీనిపై అఫీషియల్ ప్రకట‌న రావాల్సి ఉంది.