బొమ్మ‌బ్లాక్ బ‌స్ట‌ర్ ఆడియో ఫ‌స్ట్ సింగిల్ రాయే నువ్వు రాయే ను విడుద‌ల చేసిన మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్

బొమ్మ‌బ్లాక్ బ‌స్ట‌ర్ ఆడియో ఫ‌స్ట్ సింగిల్ రాయే నువ్వు రాయే ను విడుద‌ల

0
83

నూత‌న ద‌ర్శ‌కుడు రాజ్ విరాట్ డైరెక్ష‌న్ లో తెర‌కెక్కుతున్న చిత్రం బొమ్మ బ్లాక్ బ‌స్ట‌ర్…. ఈ సినిమాలో యంగ్ టాలెంటెడ్ విజయ్ శ్రీకృష్ణ‌ నందు హీరోగా నటించాడు… హీరోయిన్ గా బుల్లితెర హాట్ బ్యూటీ రష్మీ గౌతమ్ నటించింది… ఈ చిత్రం విజ‌య్ భ‌వ ఆర్ట్స్ ప‌తాకం పై ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి నిర్మిస్తున్నారు…

ముందుగా టైటిల్ ఆ త‌రువాత విడుద‌ల చేసిన టీజ‌ర్ తో అటు ఆడియెన్స్ లో ఇటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో అనూహ్య స్పంద‌న అందుకున్నారు బొమ్మ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్ర యూనిట్. ఈ నేప‌థ్యంలోనే నేడు బొమ్మ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం ఆడియో ఆల్బ‌మ్ నుంచి రాయే నువ్వు రాయే అనే పాట‌ను మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ ట్విట్ట‌ర్ ద్వారా విడుద‌ల చేశాడు. ఇక ఈ సినిమాలో నందు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పూరీజ‌గ‌న్నాథ్ ఫ్యాన్ గా కనిపించనున్నాడు…

నందు పోషించిన పోతురాజు పాత్ర వైవిధ్యంగా ఉండ‌బోతుంద‌ని టాక్… అలాగే నందు పాత్ర‌కు ధీటుగా ర‌ష్మీ గౌత‌మ్ పాత్ర కూడా ఉండ‌బోతుంద‌ని చిత్ర బృందం చెబుతోంది. ఈ చిత్రం షూటింగ్ తో పాటు అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకొని విడదులకు సిద్ధంగా ఉందని చిత్ర నిర్మాత‌లు ప్రవీణ్ పగడాల బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ తెలిపారు.

గమనిక… ల‌హ‌రి మ్యూజిక్ ద్వారా ఈ సినిమా ఆడియో అందుబాట‌లో ఉంది.
న‌టీన‌టులు

నందు విజయ్ కృష్ణ‌, ర‌ష్మీ గౌత‌మ్

సాంకేతిక వ‌ర్గం

పీ.ఆర్.ఓ : ఏలూరు శ్రీను

పబ్లిసిటీ డిజైన్స్ : ధని ఏలే

ఎడిటర్ : బి. సుధాకర్

సినిమాటోగ్రఫీ : సుజాతా సిద్ధార్థ్

మ్యూజిక్ : ప్రశాంత్ ఆర్. విహారి

నిర్మాతలు : ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ

రచన – దర్శకత్వం : రాజ్ విరాట్