రామాయణం 3D కోసం ప్లాన్ చేస్తున్న మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ?

Mega producer Allu Arvind is planning for Ramayana 3D

0
128

రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా తర్వాత తెలుగులో భారీ చిత్రాలు నిర్మిస్తున్నారు. అంతేకాదు భారీ బడ్జెట్ సినిమాలు, పాన్ ఇండియా చిత్రాలు తీస్తున్నారు. ఇక బాహుబలి తర్వాత ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కూడా ఓ భారీ చిత్రం నిర్మించాలి అని చూశారు.బాహుబలి సినిమా తర్వాత రామాయణం సినిమా తెరకెక్కించనున్నారని అప్పట్లో టాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి.

అంతేకాదు ఈ సినిమాని అల్లు అరవింద్- మధు మంతెన- నమిత్ మల్హోత్రా కలిసి నిర్మిస్తారు అనే వార్తలు వినిపించాయి. ఇక భారీ బడ్జెట్ సుమారు 800 నుంచి 1000 కోట్లు ఉంటుంది అని టాక్ నడిచింది. రావణుడిగా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, సీతగా దీపికాపదుకునే నటించే అవకాశం ఉంది అని వార్తలు వినిపించాయి.

తాజాగా ఈ చిత్రం గురించి మళ్లీ టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా త్వరలో పట్టాలెక్కే అవకాశం ఉంది అని బాలీవుడ్ నుంచి టాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.