మెగాస్టార్ చిరంజీవి సినిమాలో మరో మెగా హీరో – టాలీవుడ్ టాక్

Mega Star New movie Launching on his birthday

0
110

ఈ కరోనా సెకండ్ వేవ్ తో అన్నీ సినిమాల షూటింగులు నిలిచిపోయాయి. ఇక కొత్త సినిమాల ప్రకటనలు లేవు. రిలీజ్ కు సిద్దం అయిన చిత్రాల ఊసు లేదు. అయితే కొన్ని చిత్రాలు షూటింగ్ సగంపైనే పూర్తి చేసుకున్నాయి. అలాంటి చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి ఆచార్య ఒకటి . ఈసినిమా గురించి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

ఆచార్యకు 20 రోజుల షూటింగ్ షెడ్యూల్ మాత్రమే మిగిలి ఉంది. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యాక మరో సినిమాని సెట్స్ పై పెట్టనున్నారు చిరంజీవి. తమిళ మూవీ వేదాళం – మలయాళ హిట్ చిత్రం లూసిఫర్ ఈ రెండు చిత్రాలు చేయనున్నారు మెగాస్టార్. అయితే లూసిఫర్ చిత్రం గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

లూసిఫర్లో చిరుకు చెల్లిగా అనుష్క నటించనుందనే వార్త వినిపించింది. అంతేకాదు సాయిపల్లవి నటిస్తుంది అని మ‌రో వార్త వినిపించింది. ఇక ఇందులో విజయ్ దేవరకొండ నటిస్తున్నారనే వార్త వినిపించింది. కాని ఇవన్నీ వట్టి పుకార్లేనని విజయ్ దేవరకొండ స్పష్టం చేశారు. అయితే తాజాగా మరో వార్త వినిపిస్తోంది. ఈ సినిమాలో మెగా హీరో వరుణ తేజ్ నటిస్తున్నారు అనే వార్త, ఫిలిమ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. మరి దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజున లూసిఫర్ ను లాంచ్ చేయనున్నట్లు టాలీవుడ్ టాక్. ఈ సినిమాని ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా తీయనున్నారు.