మెగాస్టార్ – బాబీ సినిమాకి సరికొత్త టైటిల్ ? అదేనా

mega star chiranjeevi new movie with director Bobby

0
80

మెగాస్టార్ చిరంజీవి సినిమా గురించి ఎలాంటి ప్రకటన వస్తుందా అని ఆయన పుట్టిన రోజున అభిమానులు ఎదురుచూశారు. ఆయన వరుస సినిమాల అనౌన్స్ మెంట్లు వచ్చాయి. దీంతో అభిమానులు చాలా ఆనందించారు. ఆయన 153వ సినిమాగా లూసిఫర్ రీమేక్ రూపొందుతోంది. ఈ సినిమాకి దర్శకుడిగా మోహన్ రాజా చేస్తున్నారు, ఇక ఈ చిత్రానికి గాడ్ ఫాదర్ టైటిల్ ఖరారు చేశారు ఇక ఈ సినిమా షూటింగ్ జరగనుంది.

ఆ తరువాత సినిమాను బాబీ దర్శకత్వంలో చిరంజీవి చేయనున్నారు. ఈ మూవీకి సంబంధించి పోస్టర్ ను చిరంజీవి పుట్టినరోజున విడుదల చేశారు. అయితే ముందుగా ఈ సినిమాకి టైటిల్ వీరయ్య అని అనుకున్నారట. కానీ ఈ టైటిల్ విషయంలో కాస్త మెగాస్టార్ అసంతృప్తిగా ఉన్నార‌ట‌. ఇక మరో టైటిల్ పరిశీలిస్తున్నారు అని తెలుస్తోంది.

దర్శకుడు బాబీ దీని కోసం కొత్త టైటిల్ ఆలోచించారు అని వార్తలు వినిపిస్తున్నాయి. వాల్తేర్ శీను అనే టైటిల్ ను అనుకుంటున్నారట. అయితే దీనిపై ఇంకా ప్రకటన రాలేదు. ఈ పోస్టర్ అదిరిపోయింది ఆయన లుంగీ పైకి కట్టి , తలకి టవల్ చుట్టి, బీడీ కాలుస్తూ లంగర్ పట్టుకుని కనిపిస్తున్నారు. అందుకే వాల్తేరు శ్రీను అనే టైటిల్ చూస్తున్నారట. ఇది సముద్రం దగ్గర ఉండే గ్రామానికి సంబంధించిన చిత్రం అయి ఉండవచ్చు అని పోస్టర్ బ‌ట్టీ అర్దం అవుతుంది.