మెగాస్టార్ సినిమాలో మోహన్ బాబు కొరటాల ఏ పాత్ర ఇస్తున్నారంటే

మెగాస్టార్ సినిమాలో మోహన్ బాబు కొరటాల ఏ పాత్ర ఇస్తున్నారంటే

0
104

మెగాస్టార్ చిరంజీవి సినిమాల జోరు పెంచారు తాజాగా ఆయన సైరా తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు, ఇందులో ప్రభుత్వ అధికారిగా కనిపించనున్నారు, లుక్స్ పరంగా చిరుని చూస్తే చాలా యంగ్ గా కనిపించనున్నారు ఈ చిత్రంలో.

అయితే ఈ సినిమాలో చరణ్ కూడా నటిస్తారు అని వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ సమయంలో మరో హైలెట్ వార్త వినిపిస్తోంది, ఈ సినిమాలో మంచు మోహన్ బాబు కూడా నటిస్తున్నారు అని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. చిరు మోహన్ బాబు ఇద్దరూ కూడా టాలీవుడ్ లో విలన్స్ గా తమ కెరియర్ స్టార్ట్ చేశారు ఇప్పుడు హీరోలుగా వెలుగు వెలిగారు.

ఇద్దరూ కలిసి బిల్లా – రంగా, పట్నం వచ్చిన పతివ్రతలు వంటి చిత్రాల్లో హీరోలుగా కలిసి నటించారు. ఇక వీరిద్దరూ మంచి మిత్రులు అనేది తెలిసిందే.. తాజాగా కొరటాల శివ తీస్తున్న సినిమాలో మోహన్ బాబు ఓ కీలక పాత్రను పోషించనున్నారట. దీనిపై త్వరలో వార్త రానుంది అని టాలీవుడ్ లో చర్చించుకుంటున్నారు.