ఒకే స్క్రీన్ పై మెగా స్టార్, రెబల్ స్టార్..!!

ఒకే స్క్రీన్ పై మెగా స్టార్, రెబల్ స్టార్..!!

0
93

రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా సైరా సినిమాప్రమోషన్స్ లో పాల్గొననున్నాడు.. అందుకు సంబంధించి ఓ ఫోటో ను రిలీజ్ చేసింది చిత్ర బృందం.. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్ గా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ సైరా నరసింహారెడ్డి. తొలితరం స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి జీవిత గాథ ఆధారంగా ప్రస్తుతం తెరకెక్కిన ఈ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి.

బాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్ కు చెందిన పలువురు అగ్ర నటుల కలయికలో మంచి పాన్ ఇండియా ఫీల్ తో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం, లోనూ ఈ సినిమారిలీజ్ అవుతుండగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా, చిరంజీవి మరియు రామ్ చరణ్ తో కలిసి డార్లింగ్ ప్రభాస్ ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ఇవ్వనున్నారని అంటున్నారు. ఈ విషయమై ఇప్పటికే సైరా నిర్మాత రామ్ చరణ్, ప్రభాస్ ని కలవడం, అందుకు ప్రభాస్ ఎంతో సంతోషంగా ఒప్పుకోవడం జరిగిందని అంటున్నారు.