మెగాస్టార్ చిరంజీవికి వేదాలమ్ సినిమాకు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా

మెగాస్టార్ చిరంజీవికి వేదాలమ్ సినిమాకు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా

0
106

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్నారు, ఈ సినిమా షూటింగులో ఆయన వచ్చే నెల నుంచి పాల్గొంటారు, ఈ సినిమా తర్వాత ఆయన మరో రెండు చిత్రాలు ఇప్పటికే ఒకే చేశారు, వేదాలమ్ , లూసిఫర్ రీమేక్ రెండు చిత్రాల్లో నటిస్తారు, అయితే ఏది ముందు నటిస్తారు అంటే కచ్చితంగా తాజాగా టాలీవుడ్ సమాచారం ప్రకారం వేదాలమ్ అనే తెలుస్తోంది.

అయితే వచ్చే ఏడాది సమ్మర్ కి ఆచార్య సినిమా రానుంది.. ఈ సినిమా తర్వాత కచ్చితంగా అభిమానులకి వేదాలమ్ ట్రీట్ ఇవ్వనుంది, ఇప్పటికే సినిమా కథ పూర్తి అయింది, చిరు డేట్స్ ఇస్తే షూటింగ్ సెట్స్ పై కి వెళుతుంది..
తాజాగా టాలీవుడ్ టాక్ ప్రకారం ఆచార్య చిత్రానికి చిరంజీవి రూ.50 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి.

అయితే తర్వాత రెండు సినిమాలకు కూడా భారీ రెమ్యునరేషన్ వస్తుంది అంటున్నారు…అనిల్ సుంకర నిర్మించనున్న వేదాలమ్ రీమేక్ కు చిరంజీవి రూ.60 కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే అవకాశం ఉంది అని అంటున్నారు, అయితే టాలీవుడ్ లో మెగాస్టార్ ఇమేజ్ అలాంటిది, అంతేకాదు ఆయనతో సినిమా అంటే బాక్సాఫీస్ రికార్డులు బద్దలు అవుతాయి, వసూళ్లు అలాగే ఉంటాయి.
వేదాలమ్ రీమేక్ కు మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.