సినిమా టిక్కెట్ల ఇష్యూలోకి కలెక్షన్ కింగ్ మోహన్ఎం బాబు ఎంట్రీ ఇచ్చారు. ఇండస్ట్రీ పెద్దగా తాను ఉండలేనని మెగాస్టార్ చిరంజీవి ఈ ఉదయం కామెంట్లు చేశారు. అయితే ఆ కామెంట్లు చేసిన కొన్ని గంటల్లోనే మోహన్‌బాబు బహిరంగ ప్రకటన చేశారు.
తన మౌనం చేతకానితనం, చేవలేనితనం కాదని ఘాటుగా రియాక్ట్ అయ్యారు మోహన్‌బాబు. సినిమా ఇండస్ట్రీ అంటే నలుగురు హీరోలు, నలుగురు ప్రొడ్యూసర్లు,నలుగురు డిస్ట్రిబ్యూటర్లు కాదన్నారు. సినిమా పరిశ్రమలో అందరూ సమానమేనన్నారు. సినీ పరిశ్రమ ఏ ఒక్కరి గుత్తాధిపత్యం కాదని స్పష్టం చేశారు. ప్రస్తుత రేట్ల విధానంతో సినిమాలు నిలబడడం కష్టమని,చిన్న సినిమాలు ఆడాలి, పెద్ద సినిమాలు ఆడాలని పేర్కొన్నారు. సినిమాలు ఆడాలంటే సరైన ధరలు ఉండాలన్నారు మోహన్‌బాబు.
https://twitter.com/themohanbabu?