వెబ్ సిరీస్ కు మెగాస్టార్ చిరంజీవి గ్రీన్ సిగ్నల్?

0
105

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. మంచి కధ ఉన్న సినిమాలను ఎంచుకుంటూ వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు. ఇటీవలే స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా నటించిన భారీ చిత్రం ఆచార్య అనుకున్న మేరకు కలెక్షన్స్ సాదించలేకపోయిన తరువాతి సినిమాలపై దృష్టి పెట్టాడు.

ఇక ఇప్పటికే గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ వంటి సినిమాలను చేస్తున్నాడు. చేతిలో ఉన్న ఈ మూడు చిత్రాలే కాకుండా.. మరో రెండు సినిమాలకు కూడా త్వరలో అనౌన్స్‌ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇక ఇప్పుడు ఆయనకు సంబంధించి ఓ వార్త చక్కర్లు కొడుతుంది.

ఓటీటీ కోసం వెబ్‌ సిరీస్‌లో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల కొన్ని ఓటీటీ సంస్థలు చిరంజీవిని సంప్రదించినట్లు సమాచారం. వారి దగ్గరు ఉన్న కొత్త కాన్సెప్ట్‌లను కూడా వినిపించారట. అయితే తన ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని కాకుండా విభిన్నమైన కాన్సెప్ట్‌తో తన క్యారెక్టర్‌ చాలా ఫవర్‌ఫుల్‌ ఉండేలా కథను సిద్ధం చేసుకొని రమ్మని చెప్పారట. మరి చిరు రేంజ్ కి తగ్గట్లు కథ తీసుకొస్తారో లేదో చూడాలి.