గాడ్ ఫాదర్, వాళ్తేరు వీరయ్య వంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో జోష్ మీద ఉన్న మెగాస్టార్(Megastar Chiranjeevi).. ప్రస్తుతం మెహెర్ రమేష్ డైరెక్షన్లో భోళా శంకర్ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ కొత్త షెడ్యూల్ ఇటీవలే కోలకతాలో స్టార్ట్ అయింది. ఆ షూటింగ్‌కు సంబంధించిన ఫొటోస్, చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఇందులో మెగాస్టార్ టాక్సీ డ్రైవర్‌గా కనిపిస్తుండగా… ఇక ఈ సినిమా కంప్లీట్ అవ్వగానే చిరు ‘సోగ్గాడే చిన్నినాయనా’ ఫేమ్ కళ్యాణ్ కృష్ణతో ఓ సినిమా చేయనున్నాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కథా చర్చలు కూడా మొదలయ్యాయని తెలుస్తోంది. చిరంజీవి(Megastar Chiranjeevi) పెద్ద కూతురు సుస్మిత(Sushmitha) నిర్మిస్తున్న ఈ సినిమాలో యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) కూడా కీలకపాత్రలో కనిపించనుండగా. తనకు జోడీగా శ్రీ లీల ఫిక్స్ అయినట్లు టాక్. దీనిపై అఫిషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉండగా.. సెప్టెంబర్‌లో సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉందని సమాచారం.
Read Also: మరోసారి విజయ్ దేవరకొండను టార్గెట్ చేసిన అనసూయ
Follow us on: Google News, Koo, Twitter