మరోసారి తన మంచి మనసు చాటుకున్న చిరంజీవి

0
126

టాలీవుడ్ చిత్ర సీమలో ఎవరైనా సాయం అని కోరితే వెంటనే మెగాస్టార్ చిరంజీవి వారికి సాయం చేస్తారు. ఆయన మంచి మనసు గురించి చిత్ర సీమలో అందరికి తెలిసిందే. తాజాగా మెగాస్టార్ మరోసారి ఓ వ్యక్తి కి సాయం చేశారు. ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావుగారి దర్శకత్వంలో చిరంజీవి దాదాపు 30 ఏళ్ల కిందట లంకేశ్వరుడు చిత్రంలో నటించారు.

ఈ సినిమాకి ప్రభాకర్ కోడైరెక్టర్ గా పనిచేశారు. ఇక ఈ మధ్య ఆయన హెల్ప్ లైన్ అనే సినిమా తీశారు. దీంతో తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు వచ్చాయి. ప్రభాకర్ కుమారుడు ఇంజినీరింగ్ పూర్తి చేసి రెండేళ్లు కావొస్తున్నా, ఫీజులు చెల్లించకపోవడంతో ఇప్పటికీ ఆ కుర్రాడి సర్టిఫికెట్లు కాలేజీలోనే ఉన్నాయి.కుమార్తె బీబీఏ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాయాల్సి ఉంది. రెండున్నర లక్షల ఫీజు బకాయిలు ఉన్నాయి అవి చెల్లిస్తే పరీక్షలు రాయిస్తామని చెప్పారు.

దీంతో ప్రభాకర్ చిరంజీవిని కలిశారు ఆనాడు 30 ఏళ్ల క్రితం ఎంతబాగా గౌరవించారో ఇప్పుడు అలాగే చూశారు. నా సమస్యని ఆయనకు వివరించాను వెంటనే ఫీజులు చెల్లించేందుకు సహకారం అందించారని తెలిపారు.చిరంజీవిగారు మాత్రమే కాకుండా, రామ్ చరణ్, ఆయన సిబ్బంది కూడా సాయపడ్డారని ప్రభాకర్ వివరించారు.