Chiranjeevi | ఈ వయసులోనూ కండలు కరిగిస్తున్న చిరంజీవి

-

పద్మవిభూషణ్, మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) తాజాగా ‘బింబిసార’ దర్శకుడు వశిష్ట దర్శత్వంలో ‘విశ్వంభర(Vishwambhara)’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీని రూ. 200 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. సోషియో ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో నిర్మితమవుతున్న ఈ మూవీకి ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

- Advertisement -

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరగుతోంది. త్వరలోనే చిరు కూడా షూటింగ్‌లో జాయిన్ కానున్నారు. ఇందుకోసం జిమ్‌లో కసరత్తులు చేస్తున్నారు. వర్క్‌వుట్స్ చేస్తూ కష్టపడుతున్నారు. షూటింగ్‌కు రెడీ అంటూ చిరంజీవి ఈ వీడియోను షేర్ చేశారు. దీంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు అన్నయపై ప్రశంసలు కురిపిస్తు్న్నారు. 68 ఏళ్ల వయసులోనూ ఈ విధంగా కష్టపడటం మెగాస్టార్‌కే మాత్రం సాధ్యమంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఇటీవల చిరంజీవి(Chiranjeevi)కి కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్‌ పురస్కారం ప్రకటించిన విషయం విధితమే. దీంతో సినీ, రాజకీయ ప్రముఖులు చిరుకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేశారు. మరోవైపు త్వరలోనే చిరంజీవిని అభినందిస్తూ చిత్ర పరిశ్రమ తరపున సన్మాన సభ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Read Also: చలికాలంలో ఈ టిప్స్ పాటిస్తే జలుబు సమస్యలకు చెక్
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...