చిరు కొత్త సినిమాలు అనౌన్స్.. లక్కీ ఛాన్స్ కొట్టిన దర్శకులు

-

Chiranjeevi New Movies | మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా విషెస్ చెబుతున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ కొత్త మూవీస్ గురించి అప్టేడ్స్ వచ్చేశాయి. 156వ చిత్రాన్ని చిరు కుమార్తె కొణిదెల సుస్మిత గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నిర్మించనున్నారు. అయితే ఈ చిత్రానికి దర్శకుడు ఎవరనేది ప్రకటించలేదు. త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తామని ట్వీట్ చేసింది.

- Advertisement -

Chiranjeevi New Movies | ఇక 157వ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. తొలి చిత్రం బింబిసారతో సంచలన విజయం అందుకున్న వశిష్ఠ మల్లిడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా యూవీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. పంచభూతాలను చూపిస్తూ డిజైన్‌ చేసిన ఓ పోస్టర్‌ విడుదల చేసింది. ఈ పోస్టర్‌ చూస్తుంటే సోషియో ఫాంటసీ డ్రామాగా ఈ చిత్రం ఉండనుందని తెలుస్తోంది. “నన్ను, నేను చెప్పిన కథను అంగీకరించిన మైటీ మెగాస్టార్‌ చిరంజీవిగారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నాను. ఆయన్ను వెండితెరపై చూపించే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞుడిని” అని వశిష్ఠ ట్వీట్‌ చేశారు.

ఇక చిరంజీవి హీరోగా నటించిన భోళాశంకర్ సినిమా భారీ అంచనాలతో విడుదలై మెగా అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచింది. అజిత్ నటించిన తమళి మూవీ వేదాళం మూవీకు రీమేక్‌గా వచ్చిన భోళా శంకర్ తెరకెక్కింది. భోళాశంకర్ తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.33 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఓపెనింగ్ వసూళ్లు బాగానే వచ్చినా సినిమాకు వచ్చిన డిజాస్టర్ టాక్‌తో రెండో రోజు నుంచే కలెక్షన్లు భారీగా పడిపోయాయి.

Read Also: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. IRCTC ప్యాకేజీతో ఈజీగా దర్శనం
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

మహిళను కొట్టిన కాంగ్రెస్ అభ్యర్థి.. తీవ్రంగా స్పందించిన కేటీఆర్..

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతోంది. గెలుపే లక్ష్యంగా అన్ని...

బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎంపీ రాజీనామా

బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది కీలక...