Megastar Chiranjeevi.. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. ఇప్పటి వరకు తన నటన, బాక్సాఫీస్ రికార్డులతో ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న చిరు.. ఇప్పుడు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో కూడా స్థానం దక్కించుకున్నారు. తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో తిరుగులేని రికార్డ్స్‌ను తిరగరాసిన చిరు.. ఇప్పుడు గిన్నీస్ బుక్‌తో మరో రికార్డ్ సృష్టించారు. ఇప్పటికే భారత ప్రభుత్వం నుంచి పద్మభూషన్, పద్మ విభూషన్ అవార్డులు సహా డాక్టరేట్‌ను కూడా అందుకున్నారాయన.
దాదాపు 46 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్‌గా చిరు(Megastar Chiranjeevi) కొనసాగిస్తున్న తిరుగులేని జైత్రయాత్రకు గుర్తుగానే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అవార్డు దక్కింది. ఇప్పటి వరకు 156 సినిమాల్లో 537 పాటల్లో 24 వేల స్టెప్పులతో రికార్డ్ సృస్టించారు చిరు. దీంతో ఇప్పుడు గిన్నీస్ బుక్ రికార్డ్(Guinness World Record)ను అందుకున్నారు. భారత దేశంలో ఇప్పటివరకు ఇటుంటి ఘనత సాధించిన ఏకైక హీరోగా మరో రికార్డ్‌ను కూడా తన పేరిట రాసుకున్నారు చిరంజీవి. హైదరాబాద్‌లోని ఓ స్టార్ హోటల్‌లో చిరంజీవికి ఈ రికార్డును అందించారు గిన్నీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రతిధులు. ఈ అవార్డును చిరుకు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్.. ఆమిర్ ఖాన్(Aamir Khan) అందించారు.