ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మెగాస్టార్ చిరు | Megastar Chiranjeevi Started Oxygen Cylinders Distribution

0
102

క‌రోనా కష్టకాలంలో మెగాస్టార్ చిరంజీవి తన చారిట‌బుల్ ట్ర‌స్ట్ తో  మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి చారిట‌బుల్ ట్ర‌స్ట్ ఆక్సిజ‌న్ బ్యాంకుల ఏర్పాటు ప్ర‌క్రియ పూర్తి చేస్తామని గత వారంలో ప్రకటన చేసారు చిరు. మెగాస్టార్ అభిమాన సంఘాల జిల్లా అధ్య‌క్షుల ఆధ్వ‌ర్యంలో ఈ ఆక్సిజ‌న్ బ్యాంకుల నిర్వహణ జరుగుతుందన్నారు.

మంగళవారం నాడు కొన్ని జిల్లాలకు ఆక్సిజన్ పంపిణీ జ‌రిగింది. అనంత‌పూర్, గుంటూరు, శ్రీ‌కాకుళం, విజ‌య‌న‌గ‌రం, విశాఖ ప‌ట్నం, ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాల‌కు బుధ‌వారం సాయంత్రానికి ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు అందుబాటులోకి వ‌స్తాయి అని చిరంజీవి వెల్లడించారు. బ్ల‌డ్ బ్యాంక్ నుంచి ఇప్ప‌టికే ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు.. అలాగే తెలంగాణలోని పలు జిల్లాలకు కాన్ స‌న్ ట్రేట‌ర్లు పంపించారు. తెలంగాణలోని ఖమ్మం, కరీంనగర్ జిల్లాలలో బుధవారం నాడు ఆక్సిజన్ బ్యాంకులు ప్రారంభమయ్యాయి. ప్రతి జిల్లాలో ఆస్ప‌త్రి నుంచి ఆక్సిజ‌న్ కావాల‌ని కోర‌గానే సిలిండ‌ర్ల‌ను పంపిస్తారు. అవ‌స‌రాన్ని బ‌ట్టి ఈ పంపిణీ ఉంటుందని చిరు వివరించారు.

ఆంధ్ర ప్రదేశ్- తెలంగాణ రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత వల్ల ఏ ఒక్కరూ మరణించకూడదన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. తెలుగువారందరికీ ఈ ఆక్సిజన్ బ్యాంక్ అందుబాటులో ఉంటుంది. దీని కోసం ప్రత్యేకంగా ట్విట్టర్ అకౌంటును కూడా ప్రారంభించారు. ఇప్పుడున్న ఆక్సిజన్ సంక్షోభాన్ని అరికట్టే ఉద్దేశంతోనే దీన్ని ప్రారంభించామని చెబుతున్నారు మెగాస్టార్ చిరంజీవి.

ఈ కార్య‌క్ర‌మం ప్రారంభం సంద‌ర్భంగా మెగాస్టార్  మాట్లాడుతూ చిరంజీవి చారిట‌బుల్ ట్ర‌స్ట్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో ఇక నుంచి నిరంతరాయంగా ఆక్సిజ‌న్ పంపిణీ కొనసాగుతుందన్నారు. ఇక్క‌డ కొరత కారణంగా చైనా నుంచి ఆక్సిజ‌న్ కాన్ స‌న్ ట్రేట‌ర్లు ఆర్డ‌ర్ చేశామన్నారు. ప్ర‌స్తుతం చాలా చోట్ల వీటి కొరత నెల‌కొందని, అత్యవసరంగా ఎక్క‌డ అవ‌స‌రం ఉందో తెలుసుకొని ఆక్సిజ‌న్ సిలిండర్లు అందిస్తున్నామని చెప్పారు. అన్ని జిల్లాల‌కు అవ‌స‌రం ఉన్న అన్నిచోట్ల‌కు పంపిణీ చేస్తూ ఆక్సిజ‌న్ సిలిండర్లు ఎక్కడెక్కడ ఏ టైంలో చేరుకుంటున్నాయి అనేది ట్రాకింగ్ ప‌రిక‌రాన్ని కూడా టెక్నీషియ‌న్లు ఏర్పాటు చేస్తున్నారని వివరించారు. చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ ఆఫీసు నుంచి పర్యవేక్షణ ఉంటుందన్పారు. హీరో రామ్ చ‌ర‌ణ్ ఈ ఏర్పాట్ల‌న్నీ చూస్తున్నారని చిరంజీవి వెల్లడించారు.

https://youtu.be/5gsw9div_2o