మెగాస్టార్ చిరు, మణిరత్నం కాంబోలో సినిమా?

0
118
Ram charan upasana

మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. సోమవారం చిరంజీవి పుట్టినరోజు పురస్కరించుకుని ఆయన నటిస్తున్న కొత్త చిత్రాల నుంచి అప్‌డేట్స్‌ ఒక్కొక్కటిగా విడుదలవుతున్నాయి. ఇందులో భాగంగా ‘భోళా శంకర్‌’ టీమ్‌ నుంచి అప్‌డేట్‌ వచ్చేసింది. ఈ చిత్రం నుండి రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. మెగాస్టార్ చిరు నటిస్తున్న గాడ్ ఫాదర్ నుండి టీజర్ ను రిలీజ్ చేసారు.

స్టార్‌ డైరెక్టర్‌ మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న విజువల్‌ వండర్‌ “పొన్నియిన్‌ సెల్వన్‌”. ఇటీవల చిత్రంలోని ‘చోళ చోళ’ పాటను తెలుగులో విడుదల చేశారు. ఈ సందర్భంగా మణిరత్నం మాట్లాడుతూ..చిరంజీవికి  ధన్యవాదాలు అన్నారు. ఆయనకు ఎందుకు థ్యాంక్స్‌ చెప్పానో తర్వాత చెబుతానంటూ మాట దాట వేశారు. ప్రస్తుతం ఈ కామెంట్‌పై టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది.

చిరంజీవి, మణిరత్నం కాంబినేషన్‌లో సినిమా కోసం ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. అయితే, ఇప్పటివరకూ అది కార్యరూపం దాల్చలేదు. మణిరత్నం దీనిపై పరోక్షంగా సిగ్నల్ ఇచ్చారా అని కొందరు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ పార్ట్‌-1, లేదా పార్ట్‌-2లో ఏమైనా అతిథి పాత్రలో నటించారా? అన్న అనుమానం కలుగుతోంది. అదే సమయంలో తెలుగులో ఈ సినిమా కథను, ఇందులో పాత్రలను వెండితెరపై చిరంజీవి పరిచయం చేయనున్నారని కూడా టాక్‌ వినిపిస్తోంది.