కొరటాల శివతో తాజాగా చిరంజీవి ఆచార్య సినిమా చేస్తున్నారు, ఇక ఈ సినిమాలో ముందు నటిస్తాను అని చెప్పిన త్రిష సినిమా నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే, అయితే ఇప్పుడు ఇందులో ఎవరు నటిస్తారు అనేదానిపై తాజాగా క్లారిటీ వచ్చేసింది.
చిరుతో కాజల్ ఈ సినిమాలో నటిస్తారు అని వార్తలు వచ్చాయి… తాజాగా ఈ విషయాన్ని కాజల్ తెలిపారు.
ఇక ఈ సినిమాలో చరణ్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడు. ఆయనకు జోడీగా సమంత చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి.. తర్వాత కియరా అద్వానీ పేరు వినిపించింది.
ఇక తాజాగా ఈ సినిమాలో కియరా కూడా చేయడం లేదట, ఈ సినిమాలో రష్మిక పేరు తెరపైకి వచ్చింది. చరణ్ జోడీగా రష్మికను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. ఇక తాజాగా బన్నీ సినిమాలో ఆమె నటిస్తోంది, ఈ సినిమా సెట్స్ పై ఉంది.. తాజాగా చరణ్ తో కూడా ఆమె నటించనుంది అని తెలుస్తోంది.