మెగాస్టార్ కు ఆమె హ్యాండ్ ఇచ్చిన‌ట్టేనా

మెగాస్టార్ కు ఆమె హ్యాండ్ ఇచ్చిన‌ట్టేనా

0
86

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ఆచార్య‌, ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా పూర్తి అవుతోంది, ఈ స‌మ‌యంలో లాక్ డౌన్ తో షూటింగ్ ని‌లిపివేశారు, అయితే చిరుకి సంబంధించి షూటింగ్ పూర్తి చేస్తున్నారు, ఇంకా హీరోయిన్ కు సంబంధించి షూటింగ్ పార్ట్ కొర‌టాల ప్రారంభించ‌లేదు, అయి‌తే తాజాగా ఈ సినిమా నుంచి హీరోయిన్ త్రిష్ త‌ప్పుకున్నారు.

ఇక త‌ర్వాత ఆమె ప్లేస్ లోకి కాజ‌ల్ ని తీసుకున్నారు అని వార్త‌లు వినిపించాయి..ఆ విషయాన్ని కాజల్ ధృవీకరించింది కూడా. అయితే త్రిష వేరే సినిమా ఉండ‌టంతో ఈ సినిమా వ‌దులుకుంది అని వార్త‌లు వ‌చ్చాయి, ఇక కాజ‌ల్ గ‌తంలో చిరుతో సినిమా చేయ‌డంతో ఇప్పుడు కూడా ఆమె ఒప్పుకుంది.

కాని తాజాగా ఆమె కూడా ఆచార్య‌కు గుడ్ బై చెప్పింది అని వార్త‌లు వినిపిస్తున్నాయి, తమిళంలో ఉదయనిధి స్టాలిన్ జోడీగా చేయడానికి ఆమె అంగీకరించిందట. ఇందుకుగాను ఆమె బల్క్ గా డేట్స్ ఇచ్చిందనీ, భారీ పారితోషికమే అందుకుందని అంటున్నారు.ఈ సినిమాకి డేట్స్ ఎక్కు‌వు ఇవ్వ‌డంతో ఆచార్య సినిమాకి కుద‌ర‌దు అని చెప్పింది అని వార్త‌లు వ‌స్తున్నాయి, అయితే ఇది పుకారా నిజ‌మా అనేది తెలియ‌దు, చిత్ర యూనిట్ ప్ర‌క‌టించే వ‌ర‌కూ వేచి చూడాల్సిందే.