మెగాస్టార్ కి స్టోరీ చెప్పిన స్టార్ డైరెక్టర్ – టాలీవుడ్ టాక్

మెగాస్టార్ కి స్టోరీ చెప్పిన స్టార్ డైరెక్టర్ - టాలీవుడ్ టాక్

0
92

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్నారు ఈ సినిమా తర్వాత మరో రెండు చిత్రాలు ఒకే చేశారు, లూసిఫర్ అలాగే వేదాళం రీమేక్ చేయనున్నారు….ఇక ఈ రెండు చిత్రాలు ఆచార్య తర్వాత సెట్ పైకి వెళతాయి.. అంతేకాదు వచ్చే ఏడాది మార్చి నాటికి ఈ రెండు చిత్రాలు ఫినిష్ చేస్తారు… అంతేకాదు మరికొందరు దర్శకులు కధలు చెబుతుంటే అవి కూడా వింటున్నారు మెగాస్టార్.. యంగ్ దర్శకులకి అవకాశాలు ఇవ్వడానికి చిరు సిద్దంగా ఉన్నారు, వారు చెబుతున్న స్టోరీలు వింటున్నారు మెగాస్టార్ చిరంజీవి.

 

తాజాగా ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి గురించి టాలీవుడ్ లో ఓ టాక్ నడుస్తోంది.. ఆయనకు ఎంతో మంచి పేరు ఉంది. ఎంత పెద్ద హిట్ వచ్చినా ఆయన సాధారణంగానే ఉంటారు.. చాలా సింప్లిసిటీగా ఉంటారు… అయితే ఆయన తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారికి ఓ స్టోరీ చెప్పారని వార్తలు వినిపిస్తున్నాయి.

 

వంశీ పైడిపల్లి మహర్షి సినిమా తరువాత అనుకున్నంత త్వరగా మరో ప్రాజెక్టును అనౌన్స్ చేయలేదు..

ఎన్టీఆర్ .. చరణ్ .. మాహేశ్ ..నాగార్జున వీరికి మంచి హిట్ చిత్రాలు ఇచ్చారు, అయితే ఇప్పుడు ఓ కథని చిరుకి చెప్పారు అని తెలుస్తోంది. అయితే చిరు నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉందంటున్నారు ఇది టాలీవుడ్ టాక్.